పెళ్లి వ‌ద్దు.. అదే ఇష్ట‌మంటున్న హీరో న‌వ‌దీప్‌!

October 20, 2020 at 11:24 am

హీరో న‌వ‌దీప్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2004లో `జై` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన న‌వ‌దీప్‌.. సుమారు నలభై సినిమాల్లో హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్‌లో కూడా న‌టించి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కెరీర్ లో కొన్ని హిట్లు ఉన్నప్పటికీ హీరోగా స్టార్ హోదాని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఇటీవ‌ల అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన అల వైకుంఠ‌పురుములో చిత్రంలో కూడా న‌వ‌దీప్ న‌టించాడు.

ఇదిలా ఉంటే.. మూడు ప‌దుల వ‌య‌సు దాటినా న‌వ‌దీప్ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. ఆయన బయట ఎక్కడికెళ్లినా, సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించినా పెళ్లి ఎప్పుడు అని అడుగుతూనే ఉంటారు. కానీ, ఎప్ప‌టిక‌ప్పుడు న‌వ‌దీప్ మాట దాటేస్తూనే ఉంటారు. అయితే తాజాగా పెళ్లిపై స్పందిస్తూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు న‌వ‌దీప్‌.

అంద‌రూ పెళ్లి ఎప్పుడ‌ని అడుగుతున్నార‌ని.. అయితే అందరిలా తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, సింగిల్‌గా ఇలా జీవితాన్ని ఎంజాయ్ చేయ‌డ‌మే ఇష్ట‌మ‌ని చెప్పేశాడు. ప్ర‌స్తుతం న‌వ‌దీప్ వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. న‌వ‌దీప్‌కు నిజంగానే పెళ్లి ఉద్ధేశం లేదా..? లేక పెళ్లి ప్ర‌శ్న‌ను త‌ప్పించుకునేందుకు అలా చెబుతున్నాడా? అన్న‌దానిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

పెళ్లి వ‌ద్దు.. అదే ఇష్ట‌మంటున్న హీరో న‌వ‌దీప్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts