‘అమ్మోరు త‌ల్లి’ గా న‌య‌న‌తార మెప్పిస్తుందా..!?

October 27, 2020 at 6:27 pm

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నయనతార ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోతుంది. అయితే ఇప్పుడు నాయనతార మునుపెన్నడూ నటించని పాత్రలో నటిస్తుంది. ఆర్జే బాలాజీ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న అమ్మోరు త‌ల్లి చిత్రంలో అమ్మోరు పాత్రలో నయనతార నటిస్తుంది. ఈ ప్రాజెక్టు త‌మిళంలో మూకుటి అమ్మ‌న్..తెలుగులో అమ్మోరు త‌ల్లి పేరుతో విడుద‌ల కానుంది. ఎన్ జే శ‌ర‌వ‌ణ‌న్ తో క‌లిసి ఆర్జే బాలాజీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం డిస్నీ+హాట్ స్టార్ లో న‌వంబ‌ర్ 12న విడుద‌ల కానుంది. .

ఏ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ‘నేను హ‌లీం తింటాను..ప‌విత్ర‌మైన ద్రాక్ష‌ర‌సం తాగుతాను. కానీ అమ్మ‌వారి గుడిలో ప్ర‌సాదం మాత్రం చ‌చ్చినా ముట్టుకోను.అనే డైలాగ్స్ తో ట్రైలర్ మొదలవుతుంది. తర్వాత నయనతార డైలాగ్స్ మొదలవుతాయి.. దేవుడే లేడంటున్నాడే..వాడు ఒకే. కానీ ఒక్క దేవుణ్ణి పొగుడ్తూ..ఇంకో దేవుణ్ని పొగిడే వాడే చాలా డేంజ‌ర్’ అంటూ సాగే సంభాష‌ణ‌ల‌తో మొదల‌య్యే ట్రైల‌ర్ వినోదాత్మ‌కంగా, సీరియ‌స్ గా సాగుతుంది. ఇక ఈ సినిమాలో అమ్మోరు త‌ల్లి పాత్ర‌లో న‌య‌నతార పాత్ర కొంచెం ఫ‌న్ గా, సీరియ‌స్ గా సాగుతుందన్నమాట.. !! మరి నయనతార అమ్మోరు పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.. !

‘అమ్మోరు త‌ల్లి’ గా న‌య‌న‌తార మెప్పిస్తుందా..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts