ఫామ్ హౌస్ లో పెళ్లి.. దాంపత్య జీవితంలోకి నాయ‌న‌తార‌?

October 19, 2020 at 7:55 am

ప్ర‌స్తుతం లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారట. కాకపోతే పెళ్లిమాటను మాత్రం ఇద్దరూ ఎత్తడం లేదు. అయితే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇప్ప‌టికే ఎన్నో సార్లు వార్త‌లు వ‌చ్చాయి. విఘ్నేష్ శివన్‌ను సైలెంట్‌గా పెళ్లి చేసుకుందని కూడా ప్రచారం జరుగుతుంది.

చాలా రోజుల నుంచి కూడా తమిళ్ మీడియాలో నయన్ పెళ్లి గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవ‌ల డేటింగ్ బోర్ కొట్టినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటామని విఘ్నేష్ చెప్పిన సంగతి తెలిసిందే. నయన్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి గురించి స్పందించలేదు.

అయితే తాజాగా వీళ్ళు తమిళ నాడులో ఓ ఫామ్ హౌస్ లో పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారని కొత్తగా వార్తలు వస్తున్నాయి.
పెళ్లికి నయనతార తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారని.. అందుకే నయనతార కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఫామ్ హౌస్ లో పెళ్లి.. దాంపత్య జీవితంలోకి నాయ‌న‌తార‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts