NBK ‘నర్తనశాల ‘ టికెట్‌ను ఇక్కడ బుక్ చేసుకోండి

October 21, 2020 at 9:42 pm

నంద‌మూరి బాల‌కృష్ణ తండ్రి ఎన్టీఆర్ న‌టించిన న‌ర్త‌న‌శాల చిత్రాన్ని  ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో, కీల‌క పాత్ర‌లో 2004లో న‌ర్త‌న‌శాల అనే చిత్రాన్ని ప్రారంభించాడు. ఎంతో అట్టహాసంగా ప్రారంభ‌మైన ఈ చిత్రంలో అర్జునుడిగా బాల‌కృష్ణ‌, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు న‌టించారు.

ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో.. ద్రౌపది పాత్రను పోషిస్తున్న సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడంతో ఆ ప్రాజెక్టును బాలయ్య ఆపేశారు. అయితే అప్పుడు షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఈ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు బాలయ్య తీసుకొస్తున్నారు. 17 నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలను అక్టోబర్‌ 24న బాల‌య్య విడుద‌ల చేయ‌నున్నారు.

ఇక ఓటీటీ ద్వారా విడుద‌ల‌వుతున్న ‘నర్తనశాల’ సినిమాను చూడాలంటే రూ.50 పెట్టి టికెట్ కొనాల్సి ఉంటుంది. అయితే ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తాన‌ని బాలయ్య ప్ర‌క‌టించారు. ఇక‌ బాల‌య్య అభిమానులైతే ఎంతైనా పెట్టి టికెట్ కొన‌వ‌చ్చున‌ని అంటున్నారు. మ‌రియు కొంత మంది అభిమానులు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు పెట్టి టిక్ కొనాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.తాజాగా బాలయ్య సోషల్ మీడియా ద్వారా టికెట్ బుకింగ్ లింక్ ని షేర్ చేస్తూ ఒక బృహత్తరమైన దాతృత్వ కార్యక్రమంలో పాల్గొనండి అంటూ తెలుగు ప్రేక్షకులకు పిలుపునిచ్చారు .

మీరు అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక ఇతిహాసం #నర్తనశాల ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను. ఈ చిత్రం బుకింగ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీ టికెట్‌ను బుక్ చేసుకోండి మరియు ఒక బృహత్తరమైన దాతృత్వ కార్యక్రమంలో పాల్గొనండి.
మీ టికెట్‌ను ఇక్కడ బుక్ చేసుకోండి: http://bit.ly/BookNarthanasala
 
NBK ‘నర్తనశాల ‘ టికెట్‌ను ఇక్కడ బుక్ చేసుకోండి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts