కారులో సజీవ దహనం అయిన ఎన్సీపీ నేత.. ఎలా జ‌రిగిందంటే?

October 15, 2020 at 10:15 am

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వైన్ వ్యాపారి, ద్రాక్ష ఎగుమతిదారు, ఎన్సీపీ నేత సంజయ్ షిండే కారులోనే స‌జీవ ద‌హ‌నం అయ్యారు. మంగళవారం సాయంత్రం ఆయ‌న త‌న కారులో ద్రాక్ష తోటల కోసం పురుగు మందులను కొనుగోలు చేసేందుకు పింపాల్ గావ్ కు వెళ్తున్న వేళ ఈ ఘ‌ట‌న జరిగింది.

కారులోని వైరింగ్ షార్ట్‌సర్క్యూట్ అవ్వ‌డంతో మంటలు వ్యాపించాయి. కారులో శానిటైజర్లు కూడా ఉండటంతో మంటలు మరింత వేగంగా అంటుకున్నాయి. ఈ క్ర‌మంలోనే సెంట్రల్ లాకింగ్ మెకానిజమ్ యాక్టివేట్ అయి డోర్స్ జామ్ అయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ కారణంగానే సంజయ్ షిండే కారు నుంచి బయటకు రాలేక‌పోయారు.

ఇక అదే స‌మ‌యంలో స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే సంజయ్ షిండే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆయన మృతదేహాన్ని బయటకు తీసేంత వరకు స్థానికులకు, ఫైర్ సిబ్బందికి కారులో ఉన్నంది సంజయ్ షిండే అన్న విషయం తెలియకపోవడం గమనార్హం. కాగా, సంజయ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

కారులో సజీవ దహనం అయిన ఎన్సీపీ నేత.. ఎలా జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts