నితిన్‌తో కీర్తి సంద‌డి.. ఆక‌ట్టుకుంటున్న ‘రంగ్‌దే’ పోస్టర్‌!

October 25, 2020 at 10:20 am

భీష్మ హిట్ త‌ర్వాత యంగ్ హీరో నితిన్ చేస్తున్న చిత్రం `రంగ్‌దే`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కితున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై యంగ్ ప్రొడ్యూస‌ర్ సూర్యదేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

పి.డి.వి. ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక నేడు దసరా సందర్భంగా రంగ్‌ దే నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేసిన‌ చిత్ర యూనిట్.‌. ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో కీర్తి, నితిన్ సంద‌డి చేస్తూ క‌నిపించారు.

ప్రేమ‌తో కూడిన కుటుంబ క‌థా చిత్ర‌మిది. కాగా, ఈ మూవీకి సంబంధించి ఇటలీ షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉండగా.. ఇప్పటికే టీమ్‌ అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అన్ని కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా పూర్తి చేసి చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

Image

నితిన్‌తో కీర్తి సంద‌డి.. ఆక‌ట్టుకుంటున్న ‘రంగ్‌దే’ పోస్టర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts