టాలీవుడ్ హీరోతో డేటింగ్‌.. క్లారిటి ఇచ్చేసిన నిధి అగర్వాల్!

October 23, 2020 at 1:37 pm

నిధి అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2018 లో చందూ మొండేటి దర్శకత్వం లో నాగ చౌత‌న్య హీరోగా విడుదల అయిన `సవ్యసాచి` చిత్రంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన నిధి.. ఆ త‌ర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన `మిస్టర్ మజ్ను` చిత్రంతో మ‌రోసారి ప‌ల‌క‌రించింది. కానీ, ఈ రెండు చిత్రాలు ఈమెకు స‌క్సెస్ అందించ‌లేక‌పోయాయి.

అయితే రామ్ హీరోగా పూరి జగన్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. నిధి ప్రస్తుతం ఓ టాలీవుడ్ హీరోతో డేటింగ్‌లో ఉందంటూ వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఈ బ్యూటీని ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది.

తానెవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చింది. ఓ టాలీవుడ్ హీరోతో డేటింగ్ లో ఉన్న‌ట్టు వ‌చ్చిన వార్త‌లను కొట్టిపారేసింది. మొత్తానికి గ‌త కొన్ని రోజులుగా త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్ల‌కు నిధి చెక్ పెట్టింది. కాగా, ప్ర‌స్తుతం ఈ బ్యూటీ అశోక్ గ‌ల్లా డెబ్యూట్ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌రియు ర‌వితేజ‌తో త్రినాథ‌రావు న‌క్కిన రూపొందిస్తున్న చిత్రంలో కూడా నిధి న‌టించ‌నుంది.

టాలీవుడ్ హీరోతో డేటింగ్‌.. క్లారిటి ఇచ్చేసిన నిధి అగర్వాల్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts