నిమ్మగడ్డ ఇంకా కొన్ని నెలలే..?

October 24, 2020 at 4:42 pm

ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల అంశం తెర మీదకు వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎంతో మంది వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కూడా భావిస్తోంది అంటూ ఆంధ్ర రాజకీయాల్లో టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇదే విషయంపై స్పందించిన ఏపీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు మంత్రి కొడాలి నాని. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిందే రాజ్యాంగం అని అనుకుంటే కుదరదని.. ఆయన ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంటారని ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతారూ అంటూ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవంబర్ డిసెంబర్ నెలల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదు అంటూ తెలిపారు కొడాలి నాని.

నిమ్మగడ్డ ఇంకా కొన్ని నెలలే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts