నీట్ ఫలితాలు.. కోర్టు మెట్లు ఎక్కుతున్న విద్యార్థులు..?

October 21, 2020 at 6:10 pm

ఇటీవలే కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన అన్ని పరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పరీక్షలను నిర్వహించింది. ఇక ఎంతోమంది విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి నీట్ పరీక్షలు రాసిన విషయం తెలిసిందే.

ఇటీవలే నీట్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యాయి. కాని అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫలితాల్లో విద్యార్థులందరికీ తీవ్ర నిరాశే ఎదురవుతోంది. అత్యధిక మార్కులు వచ్చినప్పటికీ కూడా నీట్ పరీక్షలో సరైన మార్పులు రాలేదు అన్నట్లుగా ఫలితాలు విడుదలయ్యాయి. ఇటీవలి మహారాష్ట్రలోని వసుంధరకు నీట్ పరీక్ష లో సున్నా మార్కులు వచ్చినట్లు ఫలితాలలో తేలింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి బాంబే హైకోర్టులో పిటిషన్ వేయగా… తన ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ ని చూపించాలి అంటూ పిటిషన్లో కోరింది. ఇక మరో విద్యార్థి తనకు 212 మార్పులు వచ్చాయని ఓఎంఆర్ షీట్ ప్రకారం లెక్కేస్తే 700 మార్కులు వస్తాయి అంటూ ఆరోపించాడు.

నీట్ ఫలితాలు.. కోర్టు మెట్లు ఎక్కుతున్న విద్యార్థులు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts