నీట్ తప్పుడు ఫలితాలు.. విద్యార్థి బలి..?

October 23, 2020 at 2:30 pm

అధికారులు చేసిన తప్పిదాలు ప్రస్తుతం విద్యార్థుల ప్రాణాలను సైతం బలి కుంటున్నాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్య విద్య ప్రవేశానికి గాను నీట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థులు కూడా కరోనా వైరస్ నేపథ్యంలో ఎలాంటి సౌకర్యాలు లేక పోయినప్పటికీ ఎంతో కష్టపడి నీట్ పరీక్షలు రాశారు. కానీ ఇటీవలే విడుదలైన నీట్ ఫలితాల్లో అవకతవకలు మాత్రం విద్యార్థుల్లో తీవ్ర నిరాశ నింపుతున్నాయి.

ఇక నీట్ ఫలితాలపై రోజుకు ఒక వివాదం తెరమీదికి వస్తూనే ఉంది. ఇటీవలే డాక్టర్ కావాలనుకున్న అమ్మాయి కి మార్కుల్లో తప్పిదాల కారణంగా చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన సూర్య వంశి అనే విద్యార్థికి నీట్ పరీక్ష ఫలితాల్లో కేవలం ఆరు మార్కులు మాత్రమే వచ్చాయి దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే నీట్ మార్కులు తక్కువ వచ్చినందువల్ల తమ కూతురు ఆత్మహత్య చేసుకుంది అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఓఎంఆర్ షీట్ తెప్పించి చూడగా 720 మార్కులకు గాను ఐదు వందల తొంభై మార్కులు వచ్చి ఫస్ట్ గ్రేడ్ లో పాస్ అయింది సదరు విద్యార్థి.

నీట్ తప్పుడు ఫలితాలు.. విద్యార్థి బలి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts