ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న ప్ర‌భాస్‌?

October 18, 2020 at 12:55 pm

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జిల్ ఫేమ్ రాధ‌కృష్ష ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్‌` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని..తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు.

అలాగే ఈ చిత్రాన్ని “రెబ‌ల్‌స్టార్” కృష్ణంరాజు గారు స‌మ‌ర్పించ‌గా, వంశీ, ప్ర‌మెద్‌, ప్ర‌శీద లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ అని.. ఇందులో ఎటువంటి యాక్ష‌న్ పార్టు ఉండ‌ద‌ని అంటున్నారు. ఈ చిత్రంలో ఎలాంటి కొట్లాట‌లు, పోరాటాలు ఉండ‌వ‌ని అంటున్నారు.

ఇదే నిజ‌మైతే… ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు నిరాశ త‌ప్ప‌దు. ఎందుకంటే, సినిమాకు ఫైట్స్ అనేవి మంచి కిక్ ఇస్తాయి. అలాంటి ఫైట్సే సినిమాలో లేక‌పోతే సినిమా ఎలా ఉంటుందో అని ప్ర‌భాస్ ఫ్యాన్స్ కంగారు ప‌డుతున్నారు. కాగా, ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కి విశేష స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో న‌వ‌రాత్రులు అలానే అక్టోబ‌ర్ 23న‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా `బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్` పేరిట మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు.

ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న ప్ర‌భాస్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts