ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నంత పని చేసేసారు.. షాక్‌లో టాలీవుడ్ హీరోలు!

October 24, 2020 at 8:47 am

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అక్డోబ‌ర్ 22న కొమురం భీమ్‌ 119వ జయంతి సందర్భంగా ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరుతో టీజర్‌ని విడుదల చేశారు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌.

అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో సాగిన ఈ టీజర్ అద్భుతంగా ఆక‌ట్టుకుంది. భీమ్ పాత్రలో తారక్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు, ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇక విడుదల అయిన నిమిషం నుంచీ యూట్యూబ్‌లో సునామీ సృష్టిస్తున్న ఈ టీజ‌ర్‌.. టాలీవుడ్‌లో ఏ హీరోకు సాధ్యంకాని రికార్డును ఎన్టీఆర్ ఖాతాలో వేసి షాక్ ఇచ్చింది.

ఈ టీజర్ కు 1 మిలియన్ లైకులు అందించి తెలుగులో మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ కలిగిన టీజర్ గా మాత్రమే కాకుండా మొట్టమొదటి హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచాడు. మొత్తానికి ఎన్టీఆర్ టీజ‌ర్ కోసం ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ అన్నంత పని చేసేసారు. ఇప్పటికీ ఈ టీజర్ 18 మిలియన్ వ్యూస్ కు చేరువలో ఉండగా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నంత పని చేసేసారు.. షాక్‌లో టాలీవుడ్ హీరోలు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts