ఏపీలో 8 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య..!

October 24, 2020 at 5:34 pm

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 74919 కరోనా పరీక్షలు నిర్వహించగా 3342 కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 801131 కు చేరుకుంది. గడిచిన 24 గంటలలో కరోనా వైరస్ బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది మృత్యువాత పడ్డారు.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 6566 కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటలలో 3572 మంది కరోనా వైరస్ బారి నుండి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 31469 కరోనా కేసులు యాక్టీవ్ గా ఉన్నట్లు పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 551 కరుణ పాజిటివ్ కేసులు నమోదవగా అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో 8 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts