ఒకే మహిళతో స్నేహితులు అక్రమ సంబంధం…చివరిలో ట్విస్ట్…

October 11, 2020 at 12:38 pm

ఒకే మహిళతో ఇద్దరు స్నేహితులు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. కానీ చివరిలో విషయం తెలుసుకుని ఒక అతను, తన స్నేహితుడునే చంపేశాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. యడ్లపాడుకి చెందిన దాట్ల గోపీవర్మ, మర్రిపాలేనికి చెందిన కొమ్మూరి ప్రేమ్‌చంద్ స్నేహితులు.

అయితే ప్రేమ్‌చంద్‌కు గరికపాడుకి చెందిన తన సమీప బంధువైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవలే ప్రేమ్‌కు పెళ్లి కూడా అయింది. అయినా సరే ఆమెతో సంబంధం కొనసాగించాడు. ఇదే సమయంలో అప్పుడప్పుడు ప్రేమ్…ఫ్రెండ్ గోపి ఫోన్ నుంచి ఆ మహిళాతో మాట్లాడేవాడు.

ఇక ప్రేమ్ వెళ్లిపోయాక, గోపి ఆమెతో మాట్లాడి లైన్‌లో పెట్టాడు. గోపి కూడా ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమ్ ఆగ్రహంతో రగిలిపోయి, గోపి అడ్డు తొలగించుకోవాలని చెప్పి, ఈ నెల 2వ తేదీన గోపిని బయటకు తీసుకెళ్లి, అతను తాగే కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చాడు. విషయం తెలియని గోపి డ్రింక్ తాగేశాడు. ఇక ఇంటికి వెళ్లిపోయాక గోపీకి వాంతులు కావడంతో ఆసుపత్రిలో చేరాడు. అప్పటికే విషం శరీరంలో ఉండిపోవడంతో గోపి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న గోపి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, విచారణ చేసి ప్రేమ్‌ని అరెస్ట్ చేశారు.

ఒకే మహిళతో స్నేహితులు అక్రమ సంబంధం…చివరిలో ట్విస్ట్…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts