టాలీవుడ్‌లో మరో విషాదం..!

October 10, 2020 at 7:55 pm

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న గాన గంధర్వుడు ఎస్పి బాల సుబ్రహ్మణ్యం చనిపోయాడు. అయన చనిపోయాడన్న వార్త ఇంకా ప్రేక్షకులు మరిచిపోకుండానే టాలీవుడ్ లో మరొక విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు కల నెరవేరకుండానే చనిపోయాడు. ఒక్క సినిమా అయిన తియ్యాలని అనుకున్నాడు. కానీ, విధి వంచించి ఆ దర్శకుడి ప్రాణాలను తీసేసింది. స్క్రీన్‌ పై దర్శకుడిగా తన పేరు చూసుకోవాలని ఎంతగానే తపన పడ్డాడు. కానీ అలా జరగలేదు. అతను మరెవరో కాదు.. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ‌గా పని చేస్తున్న ప్రవీణ్. గతేడాది శర్వానంద్ హీరోగా వచ్చిన రణరంగం సినిమాకు ఈయన సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసాడు.

ఈయనకు అల్లు అరవింద్ ఆహా ఓటిటిలో ఓ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం కూడా వచ్చింది. దాంతో తన సినిమా పనులతోనే బిజీ అయిపోయాడు ప్రవీణ్. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది.అయితే ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా అందులో కార్ నడపాల్సిన సన్నివేశం ఒకటి ఉంది. అయితే ఆ సీన్‌ ను స్వయంగా తానే చేసి చూపిస్తానని చెప్పి ప్రవీణ్ కారు నడిపాడు. కానీ, అనుకోకుండా ఆ కారు ప్రమాదానికి గురైంది. అందులో తీవ్రగాయాల పాలయ్యాడు ప్రవీణ్. వారం రోజుల పాటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ, అక్టోబర్ 9న పరిస్థితి విషమించడంతో కన్ను మూసాడు. ఈ యువ దర్శకుడు కల అనేది కల్లగానే మిగిలిపోయింది. ఈయన మరణానికి పలువురు దర్శకులు సంతాపం వ్యక్తం చేసారు.

టాలీవుడ్‌లో మరో విషాదం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts