ఏపీలో కొనసాగుతున్న కరోనా వైరస్ తీవ్రత..! నేడు కొత్తగా 3,765 కొత్త కేసులు..!

October 23, 2020 at 6:12 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా తాజాగా 80 238 శాంపిల్స్ పరీక్షించడం అందులో 3,765 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,97,789 కు చేరుకుంది. మరోవైపు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 4,281 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 31 721 ఆక్టివ్ గా కేసులు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ బారినపడి రాష్ట్రవ్యాప్తంగా 20 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 65 44 కు చేరుకుంది. ఇక గడచిన 24 గంటల్లో గరిష్టంగా గుంటూరు జిల్లాలో 523 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా అత్యల్పంగా 69 కేసులు కర్నూలు జిల్లాలో నమోదయ్యాయి. అలాగే గుంటూరు జిల్లాలో అత్యధికంగా నలుగురు కరోనా బారినపడి మృతి చెందారు.

ఏపీలో కొనసాగుతున్న కరోనా వైరస్ తీవ్రత..! నేడు కొత్తగా 3,765 కొత్త కేసులు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts