ఆన్లైన్ రమ్మీ ఆడాడు.. చివరికి ప్రాణం పోయింది..?

October 31, 2020 at 6:31 pm

ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గేమ్స్ ఎంతో మంది ప్రజల పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతున్నాయి. ఆన్లైన్ లో ఎక్కువగా ప్రజలను ఆకర్షిస్తూ బానిసలుగా మార్చుకుంటూ చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాయి. ఇక్కడ ఓ బ్యాంకు ఉద్యోగికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆన్లైన్లో రమ్మీ గేమ్ కు బానిస గా మారిపోయిన బ్యాంకు ఉద్యోగి అప్పులపాలై మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.

తమిళనాడులోని కోయంబత్తూరు కు చెందిన మదర్ కుమార్ అనే 28 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి ఇటీవలే ఆన్లైన్ రమ్మి గేమ్ ఆడాడు. క్రమక్రమంగా అందులో డబ్బులు పెడుతూ బానిసగా మారిపోయాడు. ఇక వచ్చిన జీతం సరిపోక ఎంతో మంది దగ్గర అప్పులు కూడా చేశాడు ఇక రోజురోజుకీ అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో మద్యానికి బానిస గా మారి మనస్థాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్లైన్ రమ్మీ ఆడాడు.. చివరికి ప్రాణం పోయింది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts