ఆప్కో,లేపాక్షి ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభం..!

October 20, 2020 at 6:13 pm

రాష్ట్ర చేనేత,హస్తకళల ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టాయి.ఆప్కో, లేపాక్షి ఆన్‌లైన్‌ వెబ్ ‌స్టోర్‌లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోర్టల్‌ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇలా ఆన్‌లైన్‌ ద్వారా చేనేత, హస్తకళల ఉత్పత్తుల అమ్మాకాలు జరగనున్నాయి. ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేపట్టడం ద్వారా చేనేత, హస్త కళల కళాకారుల ఉత్పత్తుల తయారీ దారులకు తగిన గిట్టబాటు ధర పొందే అవకాశం ఉంటుంది.కాగా ప్రభుత్వం కూడా రూ.10 కోట్ల విలువైన చేనేత, హస్త కళల ఉత్పత్తులను ఆప్కో, లేపాక్షి ఆన్‌లైన్‌ వెబ్‌స్టోర్‌లో ఉంచనుంది.

ప్రముఖ ఈ కామర్స్ ఆన్‌లైన్‌ స్టోర్ల ద్వారా చేనేత, హస్త కళల ఉత్పత్తుల అమ్మకాలు జరగనున్నాయి. ఆప్కో ఆన్‌లైన్‌ స్టోర్ ద్వారా మంగళగిరి,వెంకటగిరి,ధర్మవరం,ఉప్పాడ,చీరాల వంటి చేనేత పట్టు,కాటన్ వస్త్రాలు అందుబాటులో ఉంచుతున్నట్టు ఆప్కో ఎండీ అంబేద్కర్ మీడియాతో తెలిపారు. లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా కొండపల్లి,ఏట్టికొప్పాక బొమ్మలు ఇంకా శ్రీకాకుళంకి చెందిన ఆదివాసుల ఉత్పత్తులు కూడా లభించనున్నాయి.

ఆప్కో,లేపాక్షి ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts