ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఎప్పుడొస్తుందంటే?

October 26, 2020 at 2:57 pm

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో ప్రాణంపోసుకున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్ ఇప్ప‌టికే ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకుంది. అలాగే నాలుగు కోట్లకు పైగా మంది క‌రోనా బారిన ప‌డి.. నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే మ‌రోవైపు ఈ క‌రోనాను అంతం చేసేందుకు ప్ర‌పంచ‌దేశాలు వ్యాక్సిన్ క‌నుగొనే దిశ‌గా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.

అయితే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెన్‌కా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై ప్ర‌పంచ‌దేశాలు ఆశ‌లు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పలు దేశాల్లో కొనసాగుతున్నాయి. మొదటి విడతను ఈ డిసెంబర్‌ నెలలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు కృషి చేస్తున్నారు.

ఇక‌ తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌ ఆండ్రియన్‌ హిల్ వ్యాక్సిన్‌పై కీల‌క ప్ర‌క‌ట చేశారు. క‌రోనా తీవ్రంగా పోరాడుతున్న వైద్య సిబ్బందికి, వ్యాక్సిన అత్యవసరంగా అందించాల్సిన అవసరం ఉన్న వృద్ధ రోగులకు మొదటి విడత కింద డిసెంబర్‌లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్ర‌స్తుతం మొదటి విడత వ్యాక్సిన్‌ డోసుల విడుదలకు అనుమతి కోరుతున్నామని, క్రిస్మస్‌లోగా అనుమతి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇక అన్ని అనుకున్న‌ట్టు జ‌రిగితే.. డిసెంబ‌ర్‌లోనే వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఎప్పుడొస్తుందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts