భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఎప్పుడో తెలిపిన చీఫ్..!

October 28, 2020 at 5:38 pm

భారత్‌లోని సీరం ఇనిస్టిట్యూట్‌లో రూపొందే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ర్టాజెనెకాలు అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ డిసెంబర్‌ చివరికి సిద్ధమవుతుందని, పుణేకు చెందిన ఆ సంస్థ చీఫ్‌ ఆదార్‌ పూనావాలా వెల్లడించారు. పది కోట్ల వ్యాక్సిన్‌ డోసులతో తొలి బ్యాచ్‌ 2021 రెండు లేదా మూడో త్రైమాసికంలో సాధారణ ప్రజలందరికి అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.భారత్‌లో డిసెంబర్‌ నాటికి మానవ పరీక్షలు పూర్తవుతాయని, భారత్‌లో జనవరి నాటికి వ్యాక్సిన్‌ లాంఛ్‌ చేస్తామని ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదార్‌ పూనావాలా పేర్కొన్నారు.

ఇక వ్యాక్సిన్‌ పూర్తిస్ధాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడిస్తూ తొలిబ్యాచ్‌గా 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను వచ్చే ఏడాది రెండు, మూడు త్రైమాసికాల్లో అంటే జూన్‌-సెప్టెంబర్ నెలలో సామాన్య ప్రజలందరికి అందుబాటులోకి మార్కెట్‌లోకి తెచ్చేందుకు వారు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో వ్యాక్సిన్‌ తయారీకి ఒప్పందం చేసుకుంది.

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఎప్పుడో తెలిపిన చీఫ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts