పైన పటారం లోన లొటారం.. జగనన్న విద్య కానుక పై విమర్శలు..?

October 9, 2020 at 4:10 pm

జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న విద్య కానుక అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా స్కూల్ విద్యార్థులందరికీ యూనిఫాంలు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు.. అందించేందుకు నిర్ణయించింది. అయితే ఈ పథకం పై స్పందించిన టిడిపి అధికార ప్రతినిధి చెంగల్రాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పైన పటారం లోన లొటారం అనే విధంగానే జగన్ సర్కార్ తీసుకొచ్చిన జగనన్న విద్యా దీవెన పథకం ఉంది అంటూ విమర్శలు గుప్పించిన ఆయన… కేవలం ప్రచార ఆర్భాటాలు కోసం మాత్రమే ఈ పథకం ప్రవేశపెట్టారు అంటూ మండిపడ్డారు.

గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే స్కూల్ విద్యార్థులకు నాలుగు జతల యూనిఫాం, హాస్టల్లో ఉండే విద్యార్థులకు బెడ్షీట్లు కాస్మోటిక్ ఛార్జీలు కూడా చెల్లించింది అంటూ గుర్తు చేసిన చెంగల్రాయుడు… జగనన్న విద్యా కానుక లో స్కూల్ విద్యార్థులకు కేవలం మూడు జతల యూనిఫాం లు మాత్రమే కుట్టించి సరిపెడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లను జగన్ సర్కార్ ఎగ్గొట్టడం ఏంటి అంటూ ప్రశ్నించారు . జగనన్న విద్యా కానుక పథకం పై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు టీడీపీ అధికార ప్రతినిధి చెంగల్రాయుడు.

పైన పటారం లోన లొటారం.. జగనన్న విద్య కానుక పై విమర్శలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts