పంజాబ్ లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుల అత్యాచారం..?

October 23, 2020 at 2:16 pm

దేశంలో కఠిన చట్టాలు వస్తున్నాయి కానీ మహిళలకు మాత్రం పూర్తిగా రక్షణ కల్పించలేక పోతున్నాయి. రోజురోజుకు ఎక్కడో ఓ చోట కామాంధుల బారిన పడి ఎంతో మంది అభం శుభం తెలియని ఆడపిల్లలు బలవుతూనే ఉన్నారు. ఆడ పిల్లల పై అత్యాచారం చేస్తే కఠిన శిక్షలు పడతాయని భయం కామాంధుల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు తరచూ వెలుగులోకి వచ్చి సభ్యసమాజంని తలదించుకునేలా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఇటీవలే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాబ్ లో ఆరు సంవత్సరాల చిన్నారి పై కన్నేసిన తాత మనవళ్ళు దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారిపోయింది. ఆడుకుంటున్న చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని నిందితుల ఇంట్లో స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

పంజాబ్ లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుల అత్యాచారం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts