ప‌వ‌న్ సినిమాలో బ‌న్నీ.. చేసేది నెగిటివ్ రోల్‌..?

October 12, 2020 at 1:23 pm

టాలివుడ్‌లో అల్లు అర్జున్ హవా కొనసాగుతోంది. చాలా జాగ్రత్తగా.. అంతే దూకుడుగా సినిమాలు చేస్తు ముందుకు సాగుతున్నారు. అదీగాక బ‌న్నీ పాత్ర ప‌రంగా ప్రాధాన్య‌త ఉంటే గెస్ట్ రోల్స్‌, మ‌ల్లీస్టార్ చిత్రాల‌ను కూడా చేసేందుకు వెనుకాడ‌రు. ఈ విష‌యాన్ని ప‌లుసార్లు ప్ర‌క‌టించారు. అదీగాక రాణిరుద్ర‌మ సినిమాలో గోన గ‌న్నారెడ్డి, చ‌ర‌ణ్ న‌టించిన ఎవ‌డు సినిమాలోనూ ప‌లు పాత్రల్లో న‌టించి మెప్పించారు కూడా. మ‌ల్టీస్టార్ చిత్రాల‌ను చేసేందుకు కూడా బాగానే ఆస‌క్తి చూపుతున్న ఇప్ప‌టి వ‌ర‌కు మాత్రం అలాంటి అవ‌కాశం రాలేదు. ప్ర‌స్తుతం ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాతో పాటుగా మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఒక తమిళ సినిమాలో కూడా నటించే అవకాశాలు ఉండవచ్చ‌నే వార్త‌లు టాలివుడ్ వ‌ర్గాల టాక్‌.

ఇదిలా ఉండ‌గా.. బ‌న్నీకి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ వార్త చిత్ర‌సీమ‌లో జోరుగా షికారు చేస్తున్న‌ది. క్రిష్ పవన్ కళ్యాణ్ కాంబినేష‌న‌లో సినిమా వ‌స్తుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై ఇంకా ఎలాంటి స్ప‌ష్ట‌త‌ లేదు. అయితే సినిమాలో అల్లు అర్జున్ నెగటివ్ పాత్రలో కనబడే అవకాశాలు ఉండవచ్చ‌ని చిత్ర‌వ‌ర్గాల స‌మాచారం. బ‌న్నీ పాత్రకు సంబంధించి దర్శకుడు క్రిష్ చాలా గట్టిగానే కష్టపడుతున్నాడు అని తెలుస్తోంది. దాదాపు పావు గంట పాటు ఈ పాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తున్న‌ది. ఇప్పుడు ఈ వార్త అటు ప‌వ‌న్‌, ఇటు బ‌న్నీ అభిమానుల్లో మాత్రం ఆనందాన్ని నింపుతున్న‌ది. సోష‌ల్‌మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

ప‌వ‌న్ సినిమాలో బ‌న్నీ.. చేసేది నెగిటివ్ రోల్‌..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts