పవన్ – రానా కాంబినేషన్ లో సినిమా… మరీ డైరెక్టర్ ఎవరు..?

October 23, 2020 at 4:46 pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతుందని గత కొన్ని రోజులు వార్తలు వస్తూనే ఉన్నాయి. మలయాళంలో పెద్ద విజయం సాధించిన అయ్యప్పన్ కోషియమ్ చిత్రానికి రీమేక్ అని, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలో ఈ సినిమా వస్తుందని టాక్ వినిపించింది. వకీల్ సాబ్, క్రిష్ తో మూవీ చేస్తున్న పవన్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ చేయడం ఏంటి అన్ని ఉత్త పుకారులే అనుకున్నారు కానీ .. ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అని తెలిసింది.

ఈ రీమేక్ లో వెంకీ,బాలయ్య నటిస్తారని మొదట వార్తలు వచ్చాయి. ఫైనల్ గా పవన్ – రానా కాంబినేషన్ సెట్ అయ్యింది. దర్శకుడు ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గా ఉండేది. ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసిన డైరెక్టర్ సాగర్ చంద్రనే ఫిక్స్ చేసినట్టు సమాచారం.ఈ దసరా పండుగకు అధికారికంగా ప్రకటించనున్నట్టు టాక్ వినిపిస్తుంది.క్రేజీ కాంబినేషన్ ఉన్న ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

పవన్ – రానా కాంబినేషన్ లో సినిమా… మరీ డైరెక్టర్ ఎవరు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts