జగన్ ప్రభుత్వానికి పవన్ కీలక సూచనలు…

October 22, 2020 at 2:29 pm

ఇటీవల ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడిన విషయం తెలిసిందే. దీని వల్ల ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. దీంతో జగన్ ప్రభుత్వం సైతం రైతులని ఆదుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్…జగన్ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.

ప్రాథమిక అంచనాల ప్రకారమే 2.71 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. ప్రధానంగా వరి పంట నీట మునిగి కుళ్లిపోతోందని.. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో వరి సాగు చేసినవారి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఉద్యాన పంటలు వేసినవారు, కూరగాయలు సాగు చేసేవారు, కడియం ప్రాంతంలో నర్సరీ రైతులు నష్టాల పాలయ్యారన్నారు.

రైతులు పెట్టిన పూర్తి పెట్టుబడిని పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. వరద ముంపులో చిక్కుకుపోయిన వారికి రేషన్, పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో మానవీయత లోపించిందని, ఇళ్లు నీట మునిగిపోయి బాధలో ఉన్నప్పుడూ నిత్యావసరాలు అందించి ఆదుకోకుండా వారం రోజుల పాటు ముంపులో ఉంటేనే వాటిని అందిస్తామని చెప్పడం భావ్యం కాదన్నారు.

జగన్ ప్రభుత్వానికి పవన్ కీలక సూచనలు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts