ఆ సినిమా నుంచి త‌ప్పుకున్న ప‌వ‌న్.. షాక్‌లో డైరెక్ట‌ర్‌?

October 20, 2020 at 10:06 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం `వకీల్ సాబ్`తో పాటు క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తరువాతి ప్రాజెక్ట్స్ చేయడానికి ఇప్ప‌టికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ తరువాత సురేందర్ రెడ్డితో మరో సినిమాను పవన్ కంఫర్మ్ చేశారు. ఇవి అన్ని ఇలా ఉంచితే పవన్ కళ్యాణ్ ఓ మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తున్నారని ప్ర‌చారం జ‌రిగింది.

అదే మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పన్నుమ్ కొషియుమ్’. ఈ మూవీ తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను సితార ఎంట‌ర్ టైన్ మెంట్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశి ద‌క్కించుకున్నారు. ఈ చిత్రాన్ని సాగర్ చంద్ర డైరెక్టర్‌గా తెలుగులో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల యూనిట్ ప‌వ‌న్‌ను కలిసి స్క్రిప్ట్ వినిపించగా ఓకే చెప్పేశారని ప్రచారం జరిగింది. అలాగే ఈ చిత్రంలో రానా త‌గ్గుబాటి కూడా న‌టించ‌నున్న‌ట్టు టాక్ న‌డిచింది.

అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా నుంచి ప‌వ‌న్ త‌ప్ప‌కున్న‌ట్టు తెలుస్తోంది. వ‌కీల్ సాబ్ షూటింగ్ ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌లో ఉంది. ఆ త‌ర్వాత క్రిష్, హరీష్ శంకర్ ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇవి ఫినిష్ అయ్యేసరికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉండటంతో.. తన కోసం యూనిట్ అంత కాలం వేచి ఉండటం ఇష్టం లేకే పవన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు టాక్‌. దీంతో ద‌ర్శ‌కుడు సాగర్ చంద్ర కాస్త హ‌ట్ అయిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆ సినిమా నుంచి త‌ప్పుకున్న ప‌వ‌న్.. షాక్‌లో డైరెక్ట‌ర్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts