సిక్స్ ప్యాక్ అందుకే చేయ‌లేదు.. ప‌వ‌న్ షాకింగ్ ఆన్స‌‌ర్‌!

October 28, 2020 at 9:08 am

రాజ‌కీయాల కార‌ణంగా సినిమాల‌కు రెండేళ్లు గ్యాప్ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ప‌వ‌న్.. క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తర్వాతి సినిమాలు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఇక ఇటీవ‌ల మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్ చేయ‌నున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించాడు.

వీరితో పాటు మ‌రో రెండు ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. ఇటీవ‌ల కాలంలో హీరోలంద‌రూ సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బాడీ చేసి.. వెండితెర‌పై ఆక‌ట్టుకుంటున్నారు. మెగా హీరోల్లో కూడా కొంద‌రు సిక్స్ ప్యాక్ బాడీతో సందడి చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ తన కెరీర్లో సిక్స్ ప్యాక్‌ కోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు.

ఈ విష‌యంపై ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న షాకింగ్ ఆన్స‌ర్ చెప్పారు. `ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలంతా సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ, నాకు సిక్స్ ప్యాక్‌పై ఇంట్రస్ట్ లేదు. నేను ధైర్యం అనే బలం కోసం పని చేస్తాను. కండలు ఎవరైనా పెంచొచ్చు. కానీ గుండె ధైర్యాన్ని పెంచుకోవడం చాలా కష్టం. ఓ రాజకీయ నేతగానూ నేను ప్రజల్లోకి వెళ్లడానికి ఆ ధైర్యం చాలా అవసరం` అని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

సిక్స్ ప్యాక్ అందుకే చేయ‌లేదు.. ప‌వ‌న్ షాకింగ్ ఆన్స‌‌ర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts