పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్ జగన్ తీర్చేనా …?

October 7, 2020 at 8:09 pm

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో డిమాండ్ చేశారు. తాజాగా ఈ -సేవ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 17 సంవత్సరాల నుంచి ఈ -సేవలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న ఎందరో ఒక్కసారిగా రోడ్డు మీద పడడం చాలా బాధగా ఉందని ఆయన తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా ఈ -సేవ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత 5 నెలల నుండి జీతాలు చెల్లించలేదని ఆయన తెలిపారు. దీంతో ఉద్యోగస్తుల కుటుంబాల పోషణ చాలా దయనీయంగా మారిందని వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ- సేవ కేంద్రాలకు సంబంధించిన విధుల్లో ఉన్న వారిని ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ కిందికి తీసుకురావాలని వారి ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ ఉద్యోగుల విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్ జగన్ తీర్చేనా …?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts