పేటీఎం మోసాలు.. రంగంలోకి సైబర్ క్రైం పోలీసులు..?

October 13, 2020 at 3:54 pm

రోజురోజుకీ సైబర్ మోసాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పోలీసులు ఎంతలా నిఘా పెట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తూ సైబర్ క్రైం మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడ మోసాలు మాత్రం ఆగడం లేదు. ప్రజలను మాయ మాటలతో నమ్మించి ఖాతాలు ఖాళీ చేసే కేటుగాళ్లు ఎక్కువై పోతున్నారు. ఇటీవలే పేటీఎం మోసాలకు పాల్పడుతున్న ముఠా ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

ప్రస్తుతం పేటియం కస్టమర్లందరూ తమ ఖాతాతో ఆధార్ కార్డు ని పేటీఎం తో లింక్ చేసుకోవడానికి కేవైసీ చేసుకోవాలి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పేటీఎం కేవైసీ అప్డేట్ పేరుతో ఎంతో మంది కేటుగాళ్లు రంగంలోకి దిగి మాయమాటలు చెప్పి ఖాతా వివరాలు తెలుసుకొని చివరికి భారీగా డబ్బులు కాజేస్తున్నారు. ఎన్నో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారు. ముందుగా డెబిట్ కార్డు నుంచి ఒక్క రూపాయి డిపాజిట్ చేయాలని కోరి ఆ తర్వాత పూర్తి వివరాలు సేకరించి రిమోట్ యాక్సెస్ ద్వారా ఖాతాలు ఖాళీ చేస్తారని పోలీసులు గుర్తించారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన వినయ్ అనే వ్యక్తి నుంచి 4.29 లక్షల వరకు కేటుగాళ్ళు కాచేసినట్టు పోలీసులు గుర్తించారు.

పేటీఎం మోసాలు.. రంగంలోకి సైబర్ క్రైం పోలీసులు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts