పెరోల్ పై విడుదలైన ఖైదీ మరో హత్య..?

October 22, 2020 at 6:04 pm

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొంతమంది ఖైదీలను పెరోల్ పై విడుదల చేస్తున్నారు జైలు అధికారులు. ఢిల్లీలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో జైలు జీవితం గడుపుతున్న ఖైదీలకు కరోనా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నందున కొంత మంది ఖైదీలను పెరోల్ పై విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇటీవల హత్య కేసులో నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పెరోల్ పై విడుదల చేయగా బయటికి వచ్చి మరో హత్య చేసిన ఘటన సంచలనం గా మారిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న విశ్వజిత్ ని ఇటీవలే పెరోల్పై విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల విక్కీ అనే వ్యక్తితో పేకాట ఆడాడు విశ్వజిత్. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వివాదం తలెత్తగా ఏకంగా హత్యచేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు నిందితుడు.

పెరోల్ పై విడుదలైన ఖైదీ మరో హత్య..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts