వైరల్ ఫోటో : ఆకూ పచ్చ వర్ణంలో పుట్టిన కుక్క పిల్ల..!

October 23, 2020 at 6:00 pm

కుక్కలు సాధారణంగా వైట్‌, బ్లాక్‌, బ్రౌన్ రంగుల్లో ఉంటాయి కదా.మరి ఆకుపచ్చ కుక్కను మీరు ఎప్పుడైనా చూశారా? ఇటీవల ఇటలీలో ఓ పప్పీ ఆకుపచ్చ బొచ్చుతో జన్మించిందట.ఈ కుక్కపిల్ల ఫొటోలు సోషల్‌ మీడియాలో ఫుల్ వైరల్‌ అవుతున్నాయి.

ఇటలీలోని సార్డినియాలో ఈ అరుదైన కుక్కపిల్ల జన్మించింది. క్రిస్టియన్ మల్లోకి అనే రైతుకు స్పెలాచియా అనే కుక్క ఉంది. అది ఇటీవల ఈ ఆకుపచ్చ కుక్కపిల్లకు జన్మనిచ్చింది.స్పెలాచియాకి నాలుగు పిల్లలు పుట్టగా మిగిలిన మూడు తెలుపురంగులోనే ఉన్నాయి. ఈ అరుదైన కుక్కపిల్లకు పిస్తా అని ఆ రైతు పేరు పెట్టారు. ప్రస్తుతం పిస్తా ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బిలివర్డిన్ అనే ఆకుపచ్చ వర్ణద్రవ్యం వల్ల అది గ్రీన్‌ కలర్‌లో పుట్టిందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. కాగా, ఆకుపచ్చ రంగు అదృష్టానికి సంకేతంగా, ప్రస్తుత కరోనా సమయంలో ఈ కుక్కపిల్ల తమ ఇంటికి రావడం శుభసూచకంగా భావిస్తున్నామని మల్లోకి ఆనందం వ్యక్తం చేసారు.

వైరల్ ఫోటో : ఆకూ పచ్చ వర్ణంలో పుట్టిన కుక్క పిల్ల..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts