నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్‌.. ఏం జ‌రిగిందంటే?

October 27, 2020 at 9:16 am

సినీ న‌టి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ అరెస్ట్ అయ్యారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్‌కి వ్యతిరేకంగా తమిళనాడులో బీజేపీ ఆందోళనకు పిలుపును ఇచ్చింది.

అతడిని అరెస్ట్ చేయాలని చిదంబరంలో బీజేపీ ఆందోళనకు బయల్దేరింది. ఈ నేపథ్యంలో కుష్బూని ఈసీఆర్‌ రోడ్డులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఇటీవ‌ల కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన కుష్బూ సుందర్.. భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

బీజేపీ ప్రధాన కార్యదర్శి రవి, పార్టీ తమిళనాడు అధ్యక్షుడు మురుగన్‌ నేతృత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక వచ్చే ఏడాదిలోనే తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కుష్బూ వంటి వారి చేరికతో కాషాయ దళానికి కలిసి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్‌.. ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts