బాలుడు దీక్షిత్‌ని హత్య చేసిన ఇద్దరు కిడ్నాపర్లు ఎన్‌కౌంటర్ ?

October 22, 2020 at 12:02 pm

మానుకోటలో కిడ్నాప్ అయిన దీక్షిత్ రెడ్డి (9) కథ విషాదాంతమైన సంగతి తెలిసిందే. ఈ బాలుడి శవం మహబూబాబాద్ శివారులో స్థానికులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో రంజిత్ రెడ్డి పెద్దకుమాకుడు దీక్షిత్ (9) ను కిడ్నాప్ చేశారు. అనంత‌రం రూ.45 లక్షలు డిమాండ్ చేశారు. పోలీసులు ఎంత వెతికినా బాలుడి అచూకీ ల‌భించ‌లేదు.

అయితే, బాలుడి త‌ల్లిదండ్రులు వారు అడిగిన‌ డబ్బు తీసుకుని వెళ్లినప్పటికీ కిడ్నాపర్లు దాన్ని తీసుకోవడానికి రాలేదు. చివరకు బాలుడిని హత్య చేశారు. ఆ బాలుడి మృతదేహం గుట్టల్లో లభ్యమైంది. బాలుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే బాలుడిని హత్య కేసులో ప్రధాన నిందితులిద్దరినీ కూడా పోలీసులు హతమార్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. డ్నాపర్లు మనోజ్‌రెడ్డి, మందసాగర్‌ను పోలీసులు కాల్చిచంపినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. బాలుడి మృతదేహం లభించిన గుట్టల్లోనే కిడ్నాపర్లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ, దీనిపై తాజాగా స్పందించిన ఎస్పీ నింధితుల ఎన్ కౌంటర్ వార్తలు అవాస్తవని తేల్చారు.

బాలుడు దీక్షిత్‌ని హత్య చేసిన ఇద్దరు కిడ్నాపర్లు ఎన్‌కౌంటర్ ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts