పోలీసులే ప్రాణం తీశారు..?

October 17, 2020 at 6:27 pm

నల్గొండ జిల్లాలో పోలీసులు దారుణంగా వ్యవహరించారు. నాటు సారా అమ్ముతుంది అనే అనే ఆరోపణలతో వృద్ధురాలు అని కూడా చూడకుండా ఓ మహిళను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు మహిళను కొట్టడంతో చివరికి వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. దీంతో పోలీసుల తీరుపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే… ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులు ఏకంగా ఒక మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటన నల్గొండ జిల్లా అడవి దేవల పల్లి మండలంలో చోటుచేసుకుంది.

నాటుసారా అమ్ముతుంది అని ఆరోపణలతో సక్రి అనే ఓ మహిళ ఇంటి పై దాడి చేసిన పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలపకుండా పెన్షన్ ఇప్పిస్తామంటూ ఏకంగా మహిళలను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే 60 ఏళ్ల వయసున్న వృద్ధురాలు అని కూడా చూడకుండా పోలీసులు సదరు మహిళ పై విచారణలో భాగంగా చేయి చేసుకోవడంతో చివరికి ఆ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు బంధువులు మహిళ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనలు నిరసనలు చేపట్టారు. దీంతో పలు ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి.

పోలీసులే ప్రాణం తీశారు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts