రూ.25 కే డ్రస్ అంటూ ప్ర‌క‌ట‌న‌.. ఎగ‌బ‌డ్డ జ‌నం.. చివ‌ర్లో పోలీసులు ట్విస్ట్?

October 24, 2020 at 2:33 pm

ప్ర‌స్తుతం కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో ప్రాణంపోసుకున్న ఈ మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఈ క‌రోనా నుంచి ర‌క్షించుకోవాలంటే మాస్క్ ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం, త‌ర‌చూ చేతుల‌ను శానిటైజ‌ర్‌తో క్లీన్ చేసుకోవ‌డం త‌ప్ప‌ని స‌రి అయిపోయింది.

అయితే మరోపక్క కొందరు మాత్రం ఈ వైరస్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు. మాకేం కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వ్యాపారస్తులు సైతం కరోనాను పట్టించుకోవడం లేదు. తాజాగా ‌తమిళనాడులోని సేలంలో నూతనంగా నిర్మించిన ఓ బట్టల దుకాణం రూ.20 నుంచి రూ. 25 కే డ్ర‌స్ అంటూ ప్ర‌క‌ట‌న చేసింది.

ఇక అంత త‌క్కువ ధ‌ర అంటే ప్ర‌జ‌లు ఆగ‌నే ఆగ‌రు క‌దా! ఇక్క‌డ కూడా అదే జ‌రిగింది. క‌రోనాను లెక్క చేయ‌కుండా బ‌ట్ట‌ల దుకాణం వ‌ద్ద జ‌నాలు ఎగ‌బ‌డ్డారు. దీంతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. అయితే విష‌యం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ బట్టల దుకాణాన్ని సీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

రూ.25 కే డ్రస్ అంటూ ప్ర‌క‌ట‌న‌.. ఎగ‌బ‌డ్డ జ‌నం.. చివ‌ర్లో పోలీసులు ట్విస్ట్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts