బీజేపీకి విరాళాల పంట…ఎన్ని కోట్లు వచ్చాయంటే…?

October 16, 2020 at 11:14 am

గత రెండు పర్యాయాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో పార్టీ అధికారంలో ఉండటంతో పలు కార్పొరేట్ కంపెనీలు కేంద్రం అండదండలు కోసం బీజేపీకి విరాళాలు ఎక్కువ మొత్తంలోనే అందించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రెటిక్ రిఫార్మ్స్అనే సంస్థ తాజాగా అందించిన వివరాల ప్రకారం… బీజేపీకి 698.082 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినట్లు తెలిసింది.

అయితే వ్యాపార సంస్థలు విరాళాల నిమిత్తమై వివిధ జాతీయ పార్టీలకు 879.10 కోట్లను విరాళంగా ఇచ్చాయి. అందులో బీజేపీకే సింహభాగం. మొత్తం 1,573 కంపెనీలు బీజేపీకి విరాళాలిచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి 122 కార్పొరేట్ కంపెనీలు 122.5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అటు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 17 కార్పొరేట్ కంపెనీలు 11.345 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. 2018-19 సంవత్సరంలో వివిధ కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు జాతీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలు ఇవి.

బీజేపీకి విరాళాల పంట…ఎన్ని కోట్లు వచ్చాయంటే…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts