ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. హై వోల్టేజ్ కాప్‌గా ప‌వ‌న్‌!

October 25, 2020 at 12:21 pm

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ప‌వ‌న్‌. హిందీలో సూపర్ హిట్ అయిన్ ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా ‘వకీల్ సాబ్’ రూపొందుతోంది. ఇది సెట్స్‌పై ఉండగా.. క్రిష్‌ దర్శకత్వంలో ఒక సినిమా, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఒక సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

Power star Pawan kalyan New Film in and as Cop, పండుగ వేళ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటన

అయితే నేడు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా మ‌రో సినిమాను ప్ర‌క‌టించి ఫ్యాన్స్‌కు మ‌రో స‌ర్పైజ్ ఇచ్చాడు ప‌వ‌న్‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్. 12గా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కు ఇది రీమేక్‌గా రూపొందనుందని టాక్‌.

కింగ్ ఆఫ్ యాటిట్యూడ్ పోలీస్ రోల్ కు సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసిన పవన్ ను మరోసారి హై వోల్టేజ్ కాప్ గా చూపించనున్నామని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అలాగే ఈ చిత్రానికి థమన్ మరోసారి పవన్ కు సంగీతం అందిస్తున్నారు.

ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. హై వోల్టేజ్ కాప్‌గా ప‌వ‌న్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts