ప్రభాస్ బర్త్ డే సీడీపీ విడుద‌లు.. నెట్టింట్లో వైర‌ల్‌!

October 21, 2020 at 8:56 am

సాధార‌ణంగా స్టార్ హీరోల పుట్టిన రోజు వేడుకలు వస్తున్నాయంటే.. వారి అభిమానులు చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. కేక్ కటింగ్‌లు, అన్న‌దానాలు, రక్తదానాలు ఇలా ఎన్నో చేసేవారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కామన్ డిస్‌ప్లే పిక్చర్ (సీడీపీ)లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. వాటిని ట్రెండ్ చేస్తూ వ‌ర‌ల్డ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.

ఇక టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ బ‌ర్త్‌డేకు మ‌రో రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నెల 23న ప్రభాస్ 41వ యేట అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో సంద‌డి షురూ చేశారు. తాజాగా ప్ర‌భాస్ బర్త్ డే కామన్ డీపీని సోషల్ మీడియాలో విడుద‌ల చేశారు.

బాహుబలిని పోలిన సాహో లుక్‌‌తో ఉన్న బర్త్ డే కామన్ డీపీ అద్భుతంగా ఉంది. అలాగే కింద ఇండియన్ సినిమా అని రాసి ఉంది. ఇక ప్ర‌స్తుతం ఈ సీడీపీ నెట్టింట వైరల్ అయి, ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. మ‌రి ఈ సీడీపీతో ప్ర‌భాస్ అభిమానులు ఎలాంటి రికార్డు సృష్టిస్తారో చూడాలి. కాగా, ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌తో పాటు నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Image

ప్రభాస్ బర్త్ డే సీడీపీ విడుద‌లు.. నెట్టింట్లో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts