ప్లాన్ మార్చుకున్న ప్ర‌భాస్‌.. షాక్‌లో నాగ్ అశ్విన్?

October 28, 2020 at 10:12 am

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధే శ్యామ్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఇట‌లీలో ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హాన‌టి ఫేమ్ నాగ అశ్విన్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌భాస్ తెలిపారు.

ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్‌లో అశ్విని దత్ నిర్మించ‌బోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ నాయకి దీపికా పదుకొనె తొలిసారిగా న‌టిస్తోంది. దీంతో పాటు ఓం రావుత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌భాస్ తెలిపారు. మొద‌ట ఈ రెండు చిత్రాల‌ను ఒకే స‌మ‌యంలో పూర్తి చేయాల‌ని ప్ర‌భాస్ అనుకున్నార‌ట‌. అయితే ఇప్పుడు ప్ర‌భాస్ ప్లాన్‌ను మార్చుకున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది.

రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ మొదట `ఆదిపురుష్` చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. దాని తర్వాత తక్కువ గ్యాప్ లోనే నాగశ్విన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాల‌ని ప్ర‌భాస్ భావిస్తున్నార‌ట‌. మ‌రి ఇదే నిజం అయితే నాగ్ అశ్విన్‌కు షాక్ త‌ప్ప‌ద‌ని చెప్పాలి. ఎందుకంటే, రాధేశ్యామ్‌, ఆదిపురుష్ పూర్తి అవ్వాలంటే చాలా స‌మ‌యం ప‌డుతుంది. దాంతో అంత స‌మ‌యం నాగ్ అశ్విన్ ప్ర‌భాస్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది.

ప్లాన్ మార్చుకున్న ప్ర‌భాస్‌.. షాక్‌లో నాగ్ అశ్విన్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts