ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచిన ప్ర‌భాస్‌!

October 25, 2020 at 9:30 am

యంగ్ రెబ‌ల్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇట‌లీలో ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇక ఈ చిత్రంలో పాటు ప్ర‌భాస్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా మ‌రియు బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ చేస్తున్నారు.

అయితే ప్ర‌భాస్ బ‌ర్త్‌డే నాడు రాధేశ్యామ్ నుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేసి సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేశారు మేక‌ర్స్‌. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను కూడా రాధేశ్యామ్ మోష‌న్ పోస్ట‌ర్ బాగా ఆక‌ట్టుకుంది. వాస్త‌వానికి ప్రభాస్ బర్త్ డే కు ఫ్యాన్స్ కాస్త ఎక్కువ ఆశలనే పెట్టుకున్నారు. కానీ అవి నిరాశలుగానే మిగిల్చాడు ప్ర‌భాస్‌.

ఎందుకంటే.. ప్ర‌భాస్ చేస్తున్న‌ మూడు భారీ ప్రాజెక్టులలో రాధే శ్యామ్, నాగశ్విన్ ల ప్రాజెక్ట్ లను పక్క పెడితే `ఆదిపురుష్` నుంచి ఒక అప్డేట్ వస్తుంది అంద‌రూ భావించారు. అలాగే ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ ల మోస్ట్ అవైటెడ్ కాంబో గురించి ఏదైనా ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ, ఆ చిత్రాల నుంచి ఎలాంటి అలికిడి లేక‌పోవ‌డంతో.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ బాగా హ‌ర్ట్ అయిన‌ట్టు టాక్‌.

ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచిన ప్ర‌భాస్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts