సర్‌ప్రైజ్ వచ్చేసింది.. విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్ అదుర్స్‌!

October 21, 2020 at 12:16 pm

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం `రాధేశ్యామ్‌`. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెర‌కెక్కితున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో కూడా విడుద‌ల కానుంది. అయితే మరో రెండు రోజుల్లో ప్రభాస్ పుట్టినరోజు రానుండగా.. అతడికి అడ్వాన్స్‌ బర్త్‌డే విషెస్ చెబుతూ తాజాగా ఫస్ట్‌లుక్‌తో పాటు పాత్ర పేరును కూడా రివీల్ చేసింది.

ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా విడుద‌ల చేసిన లుక్‌లో కారు ముందు భాగంపై కూర్చొని కిందికి చూస్తూ ప్రభాస్ చిరునవ్వులు చిందిస్తూన్నాయి. ఫుల్ ఆన్ స్టైలిష్ అండ్ క్లాస్ గా కనిపించే ప్ర‌భాస్ లుక్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇక పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా ఇటీవ‌ల‌ ఆమె` ప్రేరణ`గా నటించబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

కాగా, యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నట్టు సమాచారం.

 

సర్‌ప్రైజ్ వచ్చేసింది.. విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్ అదుర్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts