పోలీస్ ఆఫీస‌ర్‌‌గా మార‌బోతున్న `వంట‌ల‌క్క`‌.. ఖుషీలో ఫ్యాన్స్‌?

October 26, 2020 at 9:44 am

స్టార్ మాలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కేవ‌లం ఆడ‌వారే కాదు, మ‌గ‌వారు, యూత్‌, పిల్ల‌లు కూడా ఈ సీరియ‌ల్‌ను వీక్షిస్తుంటారు. ముఖ్యంగా ఈ సీరియల్‌లో వంటలక్క అలియాస్ మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్‌కు ఉన్నంత ఫాలోయింగ్ బుల్లితెర ఇండస్ట్రీలో ఎవరికీ లేదు.

సినిమా హీరోలను మించి అభిమానం ఈమెకు ఉందంటే అతిశయోక్తి కాదు. వంటలక్క కేరక్టర్ లో ఒదిగిపోయిన ప్రేమి విశ్వనాథ్ పెద్దగా గ్లామరస్ కాకపోయినప్పటికీ ఆమెకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇదంతా పక్కనపెడితే.. వంట‌ల‌క్క త్వ‌ర‌లోనే పోలీస్ ఆఫీస‌ర్‌గా మార‌బోతోంది. రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లో.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తాను ఓ తెలుగు మూవీలో నటించబోతున్నట్లు తెలిపారు. లేడి ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న మూవీలో తాను పోలీస్‌గా నటిస్తున్నట్లు ప్రేమి వివరించారు. కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికి సినిమా పూర్తి అయ్యేదని ఆమె తెలిపారు. మొత్తానికి ఈ బుల్లితెర క్వీన్‌.. త్వ‌ర‌లోనే వెండితెర ద్వారా ప్రేక్ష‌కుల‌కు అల‌రించ‌నుంది. దీంతో ఆమె అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

పోలీస్ ఆఫీస‌ర్‌‌గా మార‌బోతున్న `వంట‌ల‌క్క`‌.. ఖుషీలో ఫ్యాన్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts