పునర్నవి పెళ్లి.. కానీ అసలు విషయం ఏంటంటే..?

October 30, 2020 at 6:21 pm

బిగ్ బాస్ అనే రియాల్టీ షో లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన పునర్నవి భూపాలం ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ నడిపి బిగ్ బాస్ లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితురాలు గా మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఉన్నఫలంగా ఇటీవలే తాను ఎస్ చెప్పాను అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేసి ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టుకున్నట్లుగా ఒక ఫోటోను పోస్ట్ చేసి అభిమానులందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది పునర్నవి భూపాలం.

రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి పెళ్లి చేసుకుంటారు అనుకుంటే ఇంతకీ ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది అని అందరు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ పునర్నవి భూపాలం ఇదంతా చేసింది కేవలం ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం అన్న విషయాన్ని ఇటీవల బయటపెట్టింది. పునర్నవి, ఉద్భవ్ ప్రధాన పాత్రలో కమిట్ మెంటల్ అనే వెబ్ సిరీస్ వచ్చే నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగానే ఇలా చేసినట్లు కూడా ఇటీవలే ప్రకటించింది పునర్నవి.

పునర్నవి పెళ్లి.. కానీ అసలు విషయం ఏంటంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts