వీసా కోస‌మే పెళ్లి చేసుకున్నా.. బాల‌య్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

October 25, 2020 at 2:00 pm

రాధికా ఆప్టే.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రక్తచరిత్ర సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు.. లెజెండ్, ల‌య‌న్ సినిమాల్లో బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌టించి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర అయింది. అయితే పెళ్లయ్యాకే ఈ బ్యూటీ సినిమాల్లోకి వచ్చినప్పటికీ ఏ హీరోయిన్ ధైర్యం చేయలేని సీన్లలో సైతం నటించి.. అంద‌రి చేత ఔరా అనిపించింది.

Radhika Apte: "Akshay Kumar's INNOCENCE In Pad Man Will Win You" -  Bollywood Hungama

2012లో బెనెడిక్ట్ లండన్‌కు చెందిన ప్రముఖ మ్యుజిషియన్‌ను పెళ్లాడిన రాధికా.. ఎప్ప‌టిక‌ప్పుడు ముంబయి నుంచి లండన్ వెళ్లి భ‌ర్త‌తో ఎంజాయ్ చేస్తుంటుంది. అయితే తాజాగా పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేసింది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తన పెళ్లి గురించి రాధికా ఆప్టే మాట్లాడుతూ.. తనకు పెళ్లిపై ఏ మాత్రం న‌మ్మ‌క‌మే లేద‌ని రాధిక స్పష్టం చేసింది.

Radhika Apte on how she and hubby Benedict settle fights: We both apologise  - Movies News

అయితే సులభంగా వీసా వ‌స్తుంద‌న్న కార‌ణంతోనే తాను పెళ్లి చేసుకున్న‌ట్టు చెప్పింది. ప్ర‌స్తుతం తాను త‌న భ‌ర్త‌తో క‌లిసి జీవిస్తున్న‌ట్టు తెలిపింది. ఇక నా వరకు జీవితానికి బార్డర్స్ లేవ‌ని మ‌రియు ఈ వ్యవస్థపై నాకు నమ్మకాలు లేవ‌ని స్ప‌ష్టం చేసింది. మొత్తానికి పెళ్లిపై రాధికా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

వీసా కోస‌మే పెళ్లి చేసుకున్నా.. బాల‌య్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts