రైతు రాజ్యం అంటే అదేనా జగన్ గారు..?

October 30, 2020 at 6:13 pm

జగన్మోహన్ రెడ్డి సర్కార్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుకు మద్దతు ప్రకటించడం అంతే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు నిర్ణయించడం పై ప్రతిపక్ష పార్టీ మొదటి నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడకు ఉరితాడుబిగించినట్లే అంటూ విమర్శలు చేస్తోంది. ఇప్పటికైనా జగన్ సర్కార్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తోంది. ఇక తాజాగా ఇదే విషయంపై స్పందిస్తూ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.

జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒకవేళ తీరు మార్చుకోకుండా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే వాటిని టిడిపి పీకేస్తుంది అంటూ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏకంగా 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న జగన్ సర్కార్ రైతు రాజ్యం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ మద్దతు ధర ప్రకటించడంతో పాటు వరద బాధిత కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

రైతు రాజ్యం అంటే అదేనా జగన్ గారు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts