రైతులు ఆయన మాయలో పడ్డారా.. ఇక అంతే..?

October 22, 2020 at 3:47 pm

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్ కనెక్షన్లను త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల వ్యవసాయ బోర్లకు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయ బోర్లకు మీటర్ల కనెక్షన్లపై ప్రస్తుతం ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. వ్యవసాయ మోటార్లకు మీటర్ల కనెక్షన్లు ఇస్తే రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.

ఇక తాజాగా ఇదే విషయంపై స్పందించిన మంత్రి పేర్ని నాని ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ కనెక్షన్ బిగించడం ద్వారా రైతులకు అన్యాయం జరుగుతుంది అని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి ప్రచారాలను రైతులు నమోదు అంటూ పేర్నినాని సూచించారు. రైతులందరికీ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మోటార్లకు మీటర్ కనెక్షన్ ఇస్తుందని రైతులు చంద్రబాబు మాయలో పడ్డ వద్దు అంటూ సూచించారు మంత్రి పేర్ని నాని. ప్రతి నెల రైతులు వాడే విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటూ మంత్రి పేర్ని నాని తెలిపారు.

రైతులు ఆయన మాయలో పడ్డారా.. ఇక అంతే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts