ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. భీమ్ వ‌చ్చేది ఎప్పుడో చెప్పిన జ‌క్క‌న్న‌!

October 6, 2020 at 11:11 am

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి మొద‌టిసారి న‌టిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ వల్ల ఆరు నెలల నుంచీ ఆగిపోయిన సంగతి విదితమే. ఈ క్రమంలో నిన్న‌టి నుంచి ఈ చిత్రం షూటింగును హైదరాబాదు సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నారు.

అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి మొదలు పెట్టాడు జక్కన్న. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే రోజు ఆయ‌న టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. ఓ రేంజ్‌లో స్పంద‌న వ‌చ్చింది. అయితే ఎన్టీఆర్ టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా కుద‌ర‌లేదు.

అయితే తాజాగా కొమరం భీమ్ ఎప్పుడు వ‌స్తాడో జ‌క్క‌న్న తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలోని భీమ్‌ పాత్రను పరిచయం చేస్తూ ఈ నెల 22న జూనియర్ ఎన్టీఆర్‌ టీజర్ ను విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేర‌కు ఓ వీడియో రూపంలో తేలిపింది చిత్ర యూనిట్‌. కాగా, జక్క‌న్న గుడ్‌న్యూస్ చెప్ప‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. భీమ్ వ‌చ్చేది ఎప్పుడో చెప్పిన జ‌క్క‌న్న‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts