“ఆర్ఆర్ఆర్ ” షూటింగ్ మళ్లీ ఇలా మొదలైంది (వీడియో వైరల్ )

October 6, 2020 at 12:54 pm

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌న్ హీరోలుగు ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్ పూర్తికాగా.. కరోనా కారణంగా మిగిలిన పార్ట్ వాయిదా పడింది. సుమారు ఏడు నెలల తర్వాత హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిన్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ మ‌ళ్లీ ప్రారంభమైంది.

ఇందుకు సంబంధించిన ఓ విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్న ఆయుధాలు, వెహికల్స్‌ని ఈ వీడియోలో చూపించారు. అలాగే ఈ వీడియోలో షూటింగ్ జరిగే ప్రదేశాన్ని శానిటైజ్ చేసి దుమ్ము దులిపే పనిలో చిత్ర యూనిట్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది‌. ఇక‌ సెట్స్‌లో జాగ్రత్తలు పాటిస్తున్నామంటూ చెప్పే ప్రయత్నం చేసిన జ‌క్క‌న్న‌.. చివరగా హీరోలను యాక్షన్ అంటూ పిలిచేశారు.

ఇక లాస్ట్‌లో కొమరం భీమ్‌గా తారక్ టీజర్ ఈ నెల 22న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. కాగా, ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఇక చెర్రీ సరసన అలియా, ఎన్టీఆర్ సరసన ఒలివియా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

“ఆర్ఆర్ఆర్ ” షూటింగ్ మళ్లీ ఇలా మొదలైంది (వీడియో వైరల్ )
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts