భీం టీజర్‌పై ర‌గులుతున్న వివాదం.. రాజ‌మౌళి స‌మాధానం ఇదే‌?

October 28, 2020 at 3:44 pm

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా క‌నిపించ‌నున్నారు. ఇక ఇప్ప‌టికే అల్లూరి సీతారామరాజు లుక్‌లో చెర్రీని ప‌రిచ‌యం చేయ‌గా.. ఇటీవ‌ల భీంగా ఎన్టీఆర్ టీజ‌ర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

అయితే టీజ‌ర్ అంతా బాగానే ఉన్నా.. చివ‌ర్లో భీం తలపై టోపి పెట్టి ముస్లీంలా చూపించడంపై ఆదివాసీలు ఫైర్ అవుతున్నారు. తమ ఆరాద్య దైవమైన కొమరం భీంను ఇలా ఇతర పాత్రలో కించపరిచేలా చేసిన సన్నివేశం తమ ఆదివాసీల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ జ‌క్క‌న్న‌పై విరుచుకుప‌డుతున్నారు.

అయితే తాజాగా భీం టీజర్ విష‌యంలో ర‌గులుతున్న వివాదంపై రాజ‌మౌళి స‌మాధానం ఇచ్చాన‌ట‌. జక్కన టీం చెబుతున్న సమాచారం ప్రకారం ఈ టీజర్ లో తారక్ ను అలా చూపించిన దానికి మరియు భీం కథకు సంబంధం ఉండదని.. అయినా చిన్న టీజర్ ను చూసి మొత్తం సినిమాపైనే ఒక అంచనాకు రావడం క్లారెక్ట్ కాద‌ని క్లారిటీ ఇచ్చినట్టు స‌మాచారం.

భీం టీజర్‌పై ర‌గులుతున్న వివాదం.. రాజ‌మౌళి స‌మాధానం ఇదే‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts