రాజస్థాన్ సూపర్ విన్.. చెన్నై ప్లేఆఫ్‌కి చేరడం కష్టమే?

October 20, 2020 at 7:30 am

ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబిలో నిన్న రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నైపై రాజ‌స్థాన్ అలవొకగా విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసింది. 35 పరుగులు చేసిన రవీంద్ర జడేజానే టాప్ స్కోరర్.

అనంత‌రం 126 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కూడా తొలుత ఇబ్బంది పడింది. లక్ష్యం చిన్నదే అయినా ఛేదనలో పట్టు తప్పినట్టు కనిపించింది. అయితే చివర్లో జోస్‌ బట్లర్‌(70 నాటౌట్) అద్బుత ఆటతీరుతో హాఫ్ సెంచరీ చేయడంతో.. మరో 15 బంతులు మిగిలి ఉండగానే
చెన్నైపై విజయాన్ని అందుకుంది.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ చెన్నై టీమ్ ఆడిన ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కి చేరిన విషయం తెలిసిందే. కానీ, నిన్న జ‌రిగిన మ్యాచ్‌తో పాయింట్ల పట్టికలో చెన్నై చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. ఇక ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచినా ప్లేఆఫ్‌కి చేరడం కష్టమే. మ‌రోవైపు 10వ మ్యాచ్ ఆడిన రాజస్థాన్‌కి ఇది నాలుగో విజయంకాగా.. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్టచివరి స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది.

రాజస్థాన్ సూపర్ విన్.. చెన్నై ప్లేఆఫ్‌కి చేరడం కష్టమే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts